ఖతార్‌ ఫౌండేషన్‌ - నేషనల్‌ రీడింగ్‌ క్యాంపెయిన్‌

- July 14, 2016 , by Maagulf
ఖతార్‌ ఫౌండేషన్‌ - నేషనల్‌ రీడింగ్‌ క్యాంపెయిన్‌

నేషనల్‌ రీడింగ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఖతార్‌ ఫౌండేషన్‌ చేపట్టిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఖతార్‌ వ్యాప్తంగా ప్రజలు హాజరయ్యారు. సిటీ సెంటర్‌లో ఈద్‌ అల్‌ ఫితర్‌ సెలవుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఎడ్యుకేషనల్‌ యాక్టివిటీస్‌ నిర్వహించారు. చిన్నతనం నుంచే చదవడం పట్ల అవగాహన పెంచడం, వయసు పెరగడంతోపాటే చదవడం పట్ల ఆసక్తి కొనసాగించడం వంటివి ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యాలు. అల్‌ ఫైసల్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ సెంటర్‌ సహకారంతో రమదాన్‌ మరియు ఈద్‌ సందర్భంగా స్టోరీ టెల్లింగ్‌ సెషన్స్‌, ఎడ్యుకేషనల్‌ మరియు ఎంటర్‌టైనింగ్‌ గేమ్స్‌ని ఆహూతుల కోసం ఏర్పాటు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com