ఇండియన్ అంబాసిడర్‌తో తెలుగుదేశం కువైట్ కమిటీ భేటీ
- July 14, 2016
తెలుగుదేశం కువైట్ కమిటీ, ఇండియన్ అంబాసిడర్ శ్రీ సునీల్ జైన్‌ను జులై 12న కలిశారు. ప్రెసిడెంట్ కుదరవల్లి సుధాకర్‌రావు, కొత్త కమిటీని ఇండియన్ అంబాసిడర్‌కు పరిచయం చేశారు. జనరల్ సెక్రెటరీ రామ్ కొత్తపల్లి, ఇండియన్ కమ్యూనిటీకి, ప్రత్యేకించి తెలుగు కమిటీకి ఇండియన్ అంబాసిడర్ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఇండియన్ అంబాసిడర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. వెల్ఫేర్ కో-ఆర్డినేటర్ రవికుమార్ రాజు, తెలుగుదేశం కువైట్ కమిటీ చేపడ్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇండియన్ ఎంబసీలో తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాల్సిందిగా మరో వెల్ఫేర్ కోఆర్డినేటర్ మురళి విజ్ఞప్తి చేశారు. టిడిపి కువైట్ వెల్ఫేర్ కో-ఆర్డినేటర్స్ ఇండియన్ ఎంబసీలో రోజువారీ కార్యక్రమాల కోసం యాక్సెస్ పొందేలా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలని కోరగా, దానికి శ్రీ సునీల్ జైన్ సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ప్రెసిడెంట్ కుదరవల్లి సుధాకర్‌రావు డొనేట్ చేసిన అంబులెన్స్ వివరాల్ని అంబాసిడర్‌కి వివరించారు. విజయవాడ, విశాఖపట్నం, చెన్నయ్, తిరుపతి, హైద్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి డెడ్ బాడీస్‌ని తరలించేందుకు వీటిని వినియోగించనున్నట్లు ప్రతినిథులు వివరించారు.


తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







