కువైట్ లో అధికారుల వలలో పడ్డ భారీ అవినీతి తిమింగలం..!!
- July 04, 2025
కువైట్: కువైట్ లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఫోర్జరీ, లంచం ఆరోపణలపై పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ఉద్యోగిని అరెస్టు చేసినట్లు యాంటీ-ఫైనాన్షియల్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. నిందితుడు తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశాడని, PACI ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేశాడని ఆరోపించారు. నివాసితుల ఫిజికల్ లేదా అధికారిక డాక్యుమెంట్స్ లేకుండానే వారి నివాస చిరునామా డేటాను మార్చాడని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు.
ఉద్యోగి సంవత్సరం ప్రారంభం నుండి 5,000 కంటే ఎక్కువ మోసపూరిత లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ప్రతి లావాదేవీలో ఒక్కో కేసుకు 120 కువైట్ దినార్లను లంచంగా తీసుకున్నాడని ఆరోపించారు. నిందితుడి ఇంటి నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అతడికి సహకరించిన ఏడుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..