ఖతార్ లో 'నో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యాగ్ క్యాంపెయిన్' ముమ్మరం..!!
- July 04, 2025
దోహా, ఖతార్: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగుల రహిత దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు ఖతార్ పునరుద్ఘాటించింది. మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఖతార్ జీరో వేస్ట్, ఖతార్ నేషనల్ విజన్ 2030 లక్ష్యాలను సాధించే దిశగా జాతీయ డ్రైవ్ లో భాగంగా అవగాహన ప్రచారాలు, కమ్యూనిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
2022 నాటి మంత్రివర్గ నిర్ణయం నంబర్ 143 ప్రకారం.. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించడాన్ని నిషేధించారు. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కాగితంతో తయారు చేసిన సంచులు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, పునర్వినియోగ ప్లాస్టిక్, ఫాబ్రిక్ (నేసిన) పదార్థాల వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MECC) అల్ ఖోర్ హార్బర్లో ప్రజా అవగాహన ప్రచారాన్ని నిర్వహించింది. ఈ ప్రచారంలో మత్స్యకారులకు పర్యావరణ అనుకూల సంచుల పంపిణీ చేసింది. అదే సమయంలో ప్లాస్టిక్ సంచుల హానికరమైన ప్రభావాల గురించి, ముఖ్యంగా సముద్రంలో వాటి కారణంగా జరిగే నష్టాలను వివరించారు.
అన్ని మునిసిపాలిటీలు, ఆరోగ్య నియంత్రణ విభాగాలు, అన్ని మంత్రిత్వ శాఖలు నవంబర్ 15, 2022 నుండి ప్లాస్టిక్ బ్యాగ్ వినియోగ నియంత్రణకు సంబంధించి 2022 నాటి మంత్రివర్గ నిర్ణయం నం. (143)ను అమలు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..