హైకోర్టు ని సంప్రదించిన 'కబాలి' నిర్మాత!

- July 14, 2016 , by Maagulf
హైకోర్టు ని సంప్రదించిన 'కబాలి' నిర్మాత!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన 'కబాలి' చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌ థను గురువారం మద్రాసు హైకోర్టును సంప్రదించారు. 'కబాలి' చిత్రాన్ని అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న దాదాపు 180కి పైగా వెబ్‌సైట్లను తొలగించాలని కలైపులి హైకోర్టులో పిటీషను దాఖలు చేశారు. అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వెబ్‌సైట్లను ట్రాయ్‌ సహాయంతో బ్లాక్‌ చేయాలని పిటీషన్‌లో కలైపులి కోరారు. తమిళనాడు పైరసీ వ్యతిరేక సెల్‌ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆన్‌లైన్‌ ద్వారా రావాల్సిన వంద శాతం ఆదాయంలో 70 శాతం అనధికారిక డౌన్‌లోడింగ్‌వల్ల పోతోందని, మిగిలిన 30 శాతం మాత్రమే వస్తోందని ఆయన పేర్కొన్నారు. 'కబాలి' చిత్రం జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికాఆప్టే కథానాయికగా నటించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com