సమ్మర్ లో సురక్షితమైన డ్రైవ్ కోసం RTA కీలక టిప్స్..!!

- July 05, 2025 , by Maagulf
సమ్మర్ లో సురక్షితమైన డ్రైవ్ కోసం RTA కీలక టిప్స్..!!

యూఏఈః సమ్మర్ లో సురక్షితమైన డ్రైవింగ్ కోసం దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA వాహనదారులకు పలు సూచనలు చేసింది. వేసవిలో ప్రమాదాలను నివారించడానికి, వారి భద్రతను నిర్ధారించడానికి సాధారణ వాహన తనిఖీలతోపాటు క్రమం తప్పకుండా సర్వీసింగ్ నిర్వహించాలని గుర్తు చేసింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దుబాయ్ పోలీసుల సమన్వయంతో ఆర్టీఏ తన వార్షిక ప్రచారమైన 'ప్రమాదాలు లేని వేసవి'ని ప్రారంభించింది.
RTA ట్రాఫిక్ మరియు రోడ్స్ ఏజెన్సీలో ట్రాఫిక్ డైరెక్టర్ అహ్మద్ అల్ ఖ్జైమి మాట్లాడుతూ.. వాహనదారులను క్రమం తప్పకుండా , సాధారణ నిర్వహణ తనిఖీలను నిర్వహించాలని సూచించారు. డ్రైవ్ కు బయలుదేరే ముందు టైర్ ప్రెజర్, ఇంజిన్ ఆయిల్,  కూలెంట్ స్థాయిలను చెక్ చేసుకోవాలని అన్నారు. ఆయిల్ లీకేజీలను చూసుకోలని, ఇలాంటి తనిఖీలు ఊహించని బ్రేక్డౌన్లను నిరోధించడంలో సహాయపడతాయని తెలిపారు. వాహనదారులు తమ టైర్లను తనిఖీ చేయాలని ప్రత్యేకంగా గుర్తు చేశారు.  
RTA నిబంధనల ప్రకారం, తయారీ తేదీ దాటి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న టైర్లను యూఏఈ రోడ్లపై అనుమతించరని రోడ్సేఫ్టీయుఏఈ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ తెలిపారు.  
 వీటితోపాటు 'ప్రమాదాలు లేని వేసవి' ప్రచారంలో భాగంగా RTA.. పిల్లలను వాహనాల లోపల వదిలేయడం వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాన్ని హైలైట్ చేసింది. ఇలాంటి  ప్రవర్తన నిమిషాల్లోనే ఊపిరాడకుండా చేయడంతోపాటు వారి మరణానికి దారితీస్తుందని హెచ్చరించింది. "ఎయిర్ కండిషనింగ్ ఆన్లో ఉన్నప్పటికీ, అది సీలు చేసిన వాతావరణంలో తగినంత రక్షణను అందించదు." అని అల్ ఖ్జైమి హెచ్చరించారు. ఎక్కువసేపు ఎండలో వాహనాన్ని పార్కింగ్ చేయవద్దని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com