బల్గెరియా ప్రెసిడెన్షియల్ మెడల్ అందుకున్న సయ్యద్ బదర్‌..!!

- July 05, 2025 , by Maagulf
బల్గెరియా ప్రెసిడెన్షియల్ మెడల్ అందుకున్న సయ్యద్ బదర్‌..!!

సోఫియా: సోఫియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో శుక్రవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో బల్గేరియా రిపబ్లిక్ అధ్యక్షుడు రుమెన్ రాదేవ్.. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదికి అధ్యక్షుడి బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అవార్డును ప్రదానం చేశారు. ఈ పతకం బల్గెరియా అందజేసే అత్యున్నత అవార్డులలో ఒకటి. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన అత్యుత్తమ కృషికి గుర్తింపుగా దీనిని ప్రదానం చేసారు.

ఈ సందర్భంగా బల్గేరియన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఒమన్ సుల్తానేట్ చేపట్టిన మానవతా ప్రయత్నాల పట్ల బల్గేరియన్ ప్రజలు గౌరవాన్ని వ్యక్తం చేశారని, దీని ఫలితంగా గెలాక్సీ లీడర్ షిప్‌లోని బల్గేరియన్ సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చారని పేర్కొన్నారు. శాంతి, మానవ సంఘీభావాన్ని ప్రోత్సహించడంలో సుల్తానేట్ నిజమైన విలువలను ప్రతిబింబించే గొప్ప మనసును చాటుకుందని కొనియాడారు. సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో ఒమన్ అభివృద్ధి పథాన దూసుకుపోతుందని ప్రశంసించారు.  ఈ సందర్భంగా సయ్యద్ బదర్  బల్గెరియా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ పతకం ప్రపంచ ప్రజలను ఏకం చేసే సాధారణ సార్వత్రిక విలువలను కలిగి ఉందని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com