యూఏఈలో Dh99కే హోటల్స్, రిసార్టులు బంపరాఫర్..!!

- July 05, 2025 , by Maagulf
యూఏఈలో Dh99కే హోటల్స్, రిసార్టులు బంపరాఫర్..!!

యూఏఈ: విదేశాలలో వేసవి సెలవులు గడపడం ఆకర్షణీయమైనవి అయినప్పటికీ, అవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే, ముఖ్యంగా యూఏఈలోని హోటళ్ళు ఆకర్షణీయమైన ధరలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.  విమాన ఛార్జీలు పెరగడం,  అంతర్జాతీయ ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారడంతో.. చాలా మంది యూఏఈ నివాసితులు ఇప్పుడు తమ వేసవి సెలవులను దేశంలోనే గడపడానికి నిర్ణయించుకుంటున్నారు. యూఏఈ వ్యాప్తంగా హోటళ్ళు, రిసార్ట్‌లు ప్రత్యేక డీల్‌లను అందిస్తున్నాయి. ఒకరోజు ఉండేందుకు Dh99 నుండి ధరలను ఆఫర్ చేస్తున్నాయి. 

వేసవి నెలలలో సాధారణంగా చాలా కుటుంబాలు విదేశాలలో గడుపుతుంటారు.  ఈ సంవత్సరం ధోరణి మారింది. విమాన టిక్కెట్ల అధిక ధర, వీసా ఇబ్బందులు, ప్రయాణ ఖర్చుల పెరుగుదల కారణంగా.. స్థానికంగానే సెలవులను గడిపేందుకు ఎంచుకుంటున్నట్లు నివాసితులు చెబుతున్నారు. దీనికితోడు అనేక హోటళ్ళు వేసవి ఆఫర్లను అందిస్తున్నాయి. వీటిలో ముందస్తు చెక్-ఇన్ , ఆలస్యంగా చెక్-అవుట్, తక్కువ గది ధరలు, ఆహారంపై తగ్గింపులు,  కుటుంబాల కోసం ప్రత్యేక కార్యకలాపాలు ఉన్నాయి.

ప్రత్యేక ఆఫర్లు,  డిస్కౌంట్లు

కొన్ని హోటళ్ళు వీక్లీ ఆఫర్లను అమలు చేస్తున్నాయి.  ఇక్కడ మీరు Dh99 కంటే తక్కువ ధరకు గదిని బుక్ చేసుకోవచ్చు. రోవ్ హోటల్స్ తన యూఏఈ ప్రాపర్టీలన్నింటిలోనూ రాత్రికి కేవలం Dh99కే 10,000 గదులను అందిస్తోంది. బుకింగ్‌లు జూలై 1 నుండి 7 వరకు తెరిచి ఉంటాయి. ఆగస్టు 31 వరకు ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది.

ప్రీమియర్ ఇన్ వీక్లీ ఫ్లాష్ సేల్స్‌ను ప్రకటించింది. యూఏఈలోని ప్రాపర్టీలలో ప్రతి బుధవారం , గురువారం Dh99 నుండి గదులను అందిస్తోంది. ఈ ఆఫర్‌లలో గది ధరలపై 30 శాతం తగ్గింపు, ఆహారం, డ్రింక్స్ లపై 25 శాతం తగ్గింపు, టాక్సీ సేవలపై ప్రత్యేక తగ్గింపులు అందిస్తుంది.

రస్ అల్ ఖైమాలో, డబుల్ ట్రీ బై హిల్టన్ మార్జన్ ఐలాండ్ సెప్టెంబర్ 2 కి ముందు చేసిన ముందస్తు బుకింగ్‌లపై 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది సెప్టెంబర్ 7 వరకు వీక్లీ రెసిడెన్సీకి చెల్లుబాటు అవుతుంది.  ది హెచ్ హోటల్ దుబాయ్ 20 శాతం తగ్గింపు ఆఫర్లతోపాటు ఉచిత అల్పాహారం, 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత భోజనం, రెసిడెన్సీతో సహా పిల్లల కోసం ఉచిత ప్యాకేజీలను అందిస్తున్నాయి.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com