హైదరాబాద్ ని ముంచెత్తిన భారీ వర్షం

- July 05, 2025 , by Maagulf
హైదరాబాద్ ని ముంచెత్తిన భారీ వర్షం

హైదరాబాద్: శనివారం సాయంత్రం భాగ్యనగరాన్ని ఆకస్మికంగా కుండపోత వర్షం చుట్టుముట్టింది.కొద్ది నిమిషాల్లోనే ఆకాశం మేఘాలతో కమ్ముకుని మబ్బులు వచ్చాయి. వర్షం కురవడం ప్రారంభమైన కొద్ది సేపటికే నగరం మొత్తం జలకళతో నిండిపోయింది.కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, లక్డీకాపుల్, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. రహదారులన్నీ చెరువులను తలపించేలా మారాయి. భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు మానానమాలేదు.వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వాహనాలు నీటిలో ఇరుక్కుపోయాయి. పాదచారులు ఒక్క అడుగు ముందుకు వేయాలంటేనూ సాహసం చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ కదలకపోవడంతో చాలా మంది ప్రజలు గంటల తరబడి చిక్కుకుపోయారు.

 

లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై మురుగు నీరు కలిసిపోవడంతో వాసన, దుర్వాసనలతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా కూడా కొన్నిచోట్ల అంతరించిపోయింది.

కార్యాలయాలు, షాపుల నుంచి ఇంటికి తిరిగే సమయంలో వర్షం మొదలవ్వడం నగరవాసులకు చికాకు కలిగించింది. వర్షం పూర్తిగా ఆగకపోవడంతో చాలా మంది ట్రాఫిక్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణాలు మరింత ఆలస్యమయ్యాయి.ఇలాంటి వర్షాలు నగరంలో అసౌకర్యానికి కారణమవుతుంటే, శాశ్వత పరిష్కారాలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ బలహీనత మరోసారి బయటపడింది. అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com