తెలంగాణలో ఐఐఐటీ ప్రవేశాలు..

- July 06, 2025 , by Maagulf
తెలంగాణలో ఐఐఐటీ ప్రవేశాలు..

హైదరాబాద్: మహబూబ్ నగర్, బాసరలోని ఐఐఐటీ ప్రవేశాల మెరిట్ లిస్ట్ ను అధికారులు విడుదల చేశారు. బాసరలోని ఆర్జీయూకేటీలో 1,509 మంది, మహబూబ్‌నగర్‌ క్యాంపస్ లో 181 మంది ఎంపికైనట్టుగా వెల్లడించారు. వీరికి సంబంధించిన జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగానే ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 7 నుంచి జూలై 9వ తేదీ వరకు జరుగనుంది. కౌన్సిలింగ్ కి హాజరయ్యే విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.

ఐఐఐటీ 2025 మెరిట్ లిస్ట్ వివరాలు:
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ తోపాటు బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లు ఉన్నాయి.ఈ రెండు క్యాంపస్ లలో కలిపి మొత్తం 1,690 సీట్లు ఉండగా అందులో ఈసారి 72 శాతం సీట్లు బాలికలకే దక్కడం విశేషం. ఎంపికైన అభ్యర్థులలో బాలికలు 1,225 మంది ఉండగా, బాలురు కేవలం 465 మంది మాత్రమే ఉన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కలిపించనున్నారు అధికారులు. ప్రాథమికంగా ఎంపిక మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ https://www.rgukt.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మెరిట్ లిస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.rgukt.ac.inలోకి వెళ్ళాలి
  • తర్వాత యూజీ అడ్మిషన్స్ 2025 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • తరువాత ప్రొవిజినల్ సెలెక్టడ్ లిస్ట్ ఆఫ్ యూజీ అడ్మిషన్స్ – 2025 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com