బహ్రెయిన్ లో సోషల్ మీడియా దుర్వినియోగం..కేసులు పెరుగుదల..!!
- July 06, 2025
మనామా: గత కొన్ని సంవత్సరాలుగా బహ్రెయిన్లో కమ్యూనికేషన్ సాధనాల దుర్వినియోగానికి సంబంధించిన కేసులు ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు గణనీయంగా పెరిగాయని ఇటీవలి డేటా వెల్లడించింది. గత మూడు సంవత్సరాలలో మాత్రమే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్ల దుర్వినియోగానికి సంబంధించిన దాదాపు 3,683 కేసులను విచారించింది. 2024లో సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ కింద 1,408 కేసులు నమోదయ్యాయి. ఇది 2023తో పోలిస్తే 7%(1,314 కేసులు) పెరుగుదలను సూచిస్తుంది. 2022లో కేవలం 961 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఆన్లైన్ నేరాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ డాక్టర్ అలీ బిన్ ఫదేల్ అల్ బుయైనైన్ 2022 నవంబర్లో ప్రత్యేక సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిజిటల్ నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, దర్యాప్తులను వేగవంతం చేయడం, డిజిటల్ ఆధారాల నిర్వహణను బలోపేతం చేయడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు.
ఇటీవల, ఈ యూనిట్ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ తీసుకున్న చర్యలకు న్యాయ నిపుణులు, న్యాయవాదులు తమ మద్దతును ప్రకటించారు. సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ, సమాజాన్ని దాని దుర్వినియోగం నుండి రక్షించడానికి కఠినమైన చట్టాలు అవసరమని వారు అభిప్రాపడ్డారు.
2022 నుండి నమోదయిన అన్ని సోషల్ మీడియా దుర్వినియోగ కేసుల్లో సగానికి పైగా వాట్సాప్ సంబంధిత కేసులు ఉన్నాయి. ఈ కాలంలో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన మొత్తం 2,521 కేసుల్లో, 1,321 వాట్సాప్తో ముడిపడి ఉన్నాయి. ఇది మొత్తంలో 52% కావడం గమనార్హం. రెండవ స్థానంలో ఇన్స్టాగ్రామ్ ఉంది. 605 కేసులు (24%). టిక్టాక్ 181 కేసులతో మూడవ స్థానంలో నిలిచింది. ఫేస్బుక్ (163 కేసులు), ఎక్స్ (గతంలో ట్విట్టర్) కేవలం 65 కేసులతో తరువాతి స్థానంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'