ఆ సామాజికవర్గానికి శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం

- July 06, 2025 , by Maagulf
ఆ సామాజికవర్గానికి శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.నాగరాలు లేదా నగరాలు సామాజికవర్గానికి బీసీ-డి కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రకటించారు.ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పత్రాలు జారీ అవుతున్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సామాజికవర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మంత్రి హామీ ఇచ్చారు.

జిల్లాల మధ్య వివక్షపై మండిపాటు

విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో నాగరాలు సామాజికవర్గానికి బీసీ-డి పత్రాలు ఇస్తున్నారని, కానీ మిగతా జిల్లాల్లో అధికారులు పట్టించుకోవట్లేదని మంత్రి సవితకు వర్గ నాయకులు వివరించారు. ఈ పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారని వాపోయారు. అయితే రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా ఒకే విధంగా వ్యవహరించాలని, అధికారుల తీరుపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

2008లోనే బీసీగా గుర్తింపు, ఇప్పటికీ సమస్యలు

2008లో నాగరాలు సామాజికవర్గాన్ని బీసీ-డి కింద చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఈ వర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఈ వర్గ జనాభా అధికంగా ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు తమ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు. తక్షణమే అన్ని జిల్లాల్లో పత్రాల జారీకి చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com