'స్పైస్ జెట్' ఎయిర్ లైన్స్ వారి గొప్ప ఆఫర్
- July 14, 2015
ఒక్క రూపాయి ఎయిర్ ఫేర్ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లో భాగంగా లక్షకు పైగా వన్-వే టికెట్లను ఒక్క రూపాయికే(పన్నులు, ఫీజులు అదనం) ఆఫర్ చేస్తున్నామని స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ పేర్కొన్నారు. రౌండ్ ట్రిప్ విమాన టికెట్ల కొనుగోలుకు, ఒక వైపు రెగ్యులర్ చార్జీల కింద టికెట్లు కొనుగోలు చేసిన వారికి, ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో నాన్ స్టాప్ విమాన సర్వీసులకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. తమ కొత్త మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. నేటి (బుధవారం)నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్ శుక్రవారం అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుందని, నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ప్రయాణాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







