బి.డబ్ల్యు.ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వలసల సదస్సు

- July 07, 2025 , by Maagulf
బి.డబ్ల్యు.ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వలసల సదస్సు

కౌలలంపూర్‌: మలేషియాలోని కౌలలంపూర్‌లో జరిగిన అంతర్జాతీయ వలసల కార్యక్రమంలో ఈ రోజు జరిగిన ముఖ్య సదస్సులో బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (BWI) సంస్థలో భాగంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, ఖతార్, బహ్రెయిన్, క్రొయేషియా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆయా దేశాల్లో అమలులో ఉన్న కార్మిక చట్టాలు, ఇతర దేశాలకు వలస వెళ్లే కార్మికుల హక్కులు, వారిని రక్షించేందుకు పాటించవలసిన చట్టాలు తదితర అంశాలపై విశ్లేషణ జరిపారు.

ఈ చట్టాలను అనుసరిస్తూ, వాణిజ్యాభివృద్ధిలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ అనుబంధ సంస్థలు కలిసి పనిచేయాలన్న ఒప్పందానికి ప్రతినిధులు కుదిరారు. ఈ కార్యక్రమంలో భారత్‌ నుంచి తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుండి ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైండ్ల రాజిరెడ్డి, అలాగే ఖతార్‌లో తెలంగాణ గల్ఫ్ సమితి పేరుతో సంస్థ నడుపుతున్న తెలంగాణ వాసి సుందరగిరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కార్మికులకు బలమైన మద్దతు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక మంచి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తుందని వారు తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com