భారత్లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’: ప్రధాని మోదీ

- July 07, 2025 , by Maagulf
భారత్లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్టు, వచ్చే ఏడాది భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. వృద్ధిచెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావాన్ని పరిశీలించి, దాని ఉపయోగాలను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కలిసి రిస్పాన్సిబుల్ AI కోసం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని మోదీ పేర్కొన్నారు.

భారత్ ఇప్పటికే వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో AI వినియోగాన్ని వేగంగా విస్తరింపజేస్తోందని ప్రధాని తెలిపారు. రైతులకు ఖచ్చితమైన వాతావరణ సూచనలు, విద్యార్థులకు ఇంటెలిజెంట్ లెర్నింగ్ పథకాలు, ఆరోగ్యరంగంలో సత్వర నిర్ధారణ కోసం AIను వినియోగిస్తున్నామన్నారు. ఇవన్నీ ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.

AIతో ఉత్పత్తి చేస్తున్న డిజిటల్ కంటెంట్ ప్రామాణికతను నిర్ధారించేందుకు గ్లోబల్ ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు. కంటెంట్ మూలాన్ని తెలుసుకునే విధంగా టెక్నాలజీ ఉండాలి. దీంతో పారదర్శకత పెరగడంతోపాటు దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని తెలిపారు. ప్రపంచం AI దిశగా వేగంగా మారుతోందనీ, అందుకే భారత్ కీలక నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందని మోదీ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com