#పూరిసేతుపతి రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం
- July 07, 2025
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త కథానాయికగా నటిస్తోంది.
ఇటీవలే లాంచ్ అయిన ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం సభ్యులు పాల్గొనే కీలక సన్నివేశాలను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్రూ పాన్-ఇండియా ఎంటర్టైనర్గా #పూరి సేతుపతి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది.
తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల
ప్రెజెంట్స్: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్, JB మోషన్ పిక్చర్స్
సీఈఓ: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక