కొన్ని పనుల్లో మానవ మేధస్సు అవసరం: బిల్ గేట్స్

- July 08, 2025 , by Maagulf
కొన్ని పనుల్లో మానవ మేధస్సు అవసరం: బిల్ గేట్స్

అమెరికా: ఇప్పటి డిజిటల్ యుగంలో, ప్రతి ఒక్కరికీ ఒక ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. “నా ఉద్యోగం భవిష్యత్తులో AI వల్ల మాయం అయిపోతుందా?” ఈ ఆందోళనకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ, కొన్ని వృత్తులు ఏ స్థాయిలో కూడా AI ప్రవర్తన వల్ల పూర్తిగా ప్రభావితమయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు.

బిల్ గేట్స్ అభిప్రాయం ప్రకారం, మొదటిగా, కోడర్లు అంటే ప్రోగ్రామర్లు వీరి పనిని తాత్కాలికంగా AI చేయగలిగినా, అసలైన సాంకేతిక దృష్టి, యూజర్ అవసరాలను అర్థం చేసుకుని సొల్యూషన్స్ తయారు చేయడం, డిజైన్ మెరుగుదల వంటి ముఖ్యమైన పనుల్లో మానవ మేధస్సు లేకపోతే అసలు పని జరగదు.

ఎప్పటికీ మనుషుల పర్యవేక్షణ అవసరమే

రెండవది ఎనర్జీ రంగం న్యూక్లియర్ ఎనర్జీ నుంచి రిన్యూవబుల్ సోర్స్ వరకు అన్నీ చాలా నాజూకుగా పనిచేస్తాయి.ఈ రంగంలో ఓ చిన్న తప్పు చాలా పెద్ద నష్టాన్ని తీసుకురావచ్చు. అందుకే ఈ రంగంలో ఎప్పటికీ మనుషుల పర్యవేక్షణ అవసరమే. మూడవది బయాలజీ, జీవశాస్త్ర పరిశోధనలు. ఇవి కేవలం డేటాతో జరగవు. జీవ వ్యవస్థలపై లోతైన అవగాహన, ప్రయోగాత్మక ఆలోచనలు, అసాధారణ దృష్టికోణాలు ఇవన్నీ మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమవుతాయి.ఈ మూడు రంగాలవారి పనితనం, ఆలోచనా సరళి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నీ కలిసి ఒక విలక్షణతను కలిగిస్తాయి. అది ఏ AI టూల్‌తో పోల్చలేము.

AI అభివృద్ధి అనేది ఒక మార్గం మాత్రమే

మనం భావించే రోబో వరల్డ్‌కైనా, కొన్ని పనులు పూర్తిగా మన చేతుల్లోనే ఉంటాయని బిల్ గేట్స్ చెప్పిన ఈ మాటలు ఈ రోజుల్లో యువతకు ఆశ మరియు స్పష్టతనిస్తాయి. AI అభివృద్ధి అనేది ఒక మార్గం మాత్రమే కానీ మానవ విలువలు, అనుభవం, సృజన శక్తి అనేవి ఏ టెక్నాలజీకి భయపడే అవసరం లేదని ఈ మాటలు మనందరికీ గుర్తు చేస్తాయి. AI వల్ల భవిష్యత్తులో వారం రోజుల్లో చేసే పనిని రెండు లేదా మూడు రోజులు మాత్రమే పని చేయాల్సి రావొచ్చని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. మిగిలిన సమయాన్ని వ్యక్తిగత అభివృద్ధికి, కుటుంబానికి కేటాయించవచ్చని సూచించారు. AI ప్రభావానికి లోనవుతున్న ఉద్యోగాలు ఫ్యాక్టరీ వర్కర్లు, నిర్మాణ కార్మికులు, హోటల్ క్లీనర్లు వంటి పనులు భవిష్యత్తులో AI కారణంగా తగ్గిపోయే అవకాశం ఉందని బిల్ గేట్స్ హెచ్చరించారు.

ఆరోగ్య, విద్య రంగాల్లో AI వల్ల విప్లవాత్మక మార్పులు

అంతేకాక, వైద్యులు మరియు ఉపాధ్యాయులాంటి వృత్తుల్లో కూడా AI కీలక పాత్ర పోషించి, మానవ శ్రమపై ఆధారపడే అవసరాన్ని కొంత మేర తగ్గించబోతుందని అన్నారు. ఆరోగ్య, విద్య రంగాల్లో AI వల్ల విప్లవాత్మక మార్పులు వస్తాయని బిల్ గేట్స్ విశ్వాసం. AI ట్యూటర్లు, డయాగ్నస్టిక్ టూల్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జీతాల్లో కోత.. బోనస్ కి రాంరాం.. టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇవన్నీ కావు.. బిల్ గేట్స్ అభిప్రాయం ప్రకారం, AI అనేక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నా, ఇది పూర్తిగా భయపడాల్సిన విషయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సాంకేతిక మార్పులు ఒక దిశగా మానవ శ్రమను తగ్గించడానికే ఉన్నా మానవ ప్రతిభను మరింత మెరుగ్గా వినియోగించేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని కీలక రంగాల్లో ఉదాహరణకి, సృజనాత్మకత అవసరమైన ప్రాంతాలు, క్లిష్టమైన సమస్య పరిష్కారాలలో మానవ నైపుణ్యం ఎప్పటికీ అవసరం అవుతుందని బిల్ గేట్స్ చెప్పారు. AI టూల్స్‌ను ఉద్యోగులకు సహాయం చేసే ‘కో-పైలట్’లా భావించాలి. ఇది వారి పనితీరును వేగవంతం చేస్తుంది, మెరుగైన లక్షణాలు, నాణ్యతను పెంచుతుంది .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com