42% పెరిగిన హాలిడే హోమ్స్, ఛాలెట్ల వాణిజ్య రిజిస్ట్రేషన్లు..!!

- July 08, 2025 , by Maagulf
42% పెరిగిన హాలిడే హోమ్స్, ఛాలెట్ల వాణిజ్య రిజిస్ట్రేషన్లు..!!

రియాద్:  2025 రెండవ త్రైమాసికంలో హాస్పిటాలిటీ రంగానికి సంబంధించిన వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్యలో సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. హాలిడే హోమ్స్, ఛాలెట్ల వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య 42 శాతం పెరిగింది.  ఈ సంవత్సరం రెండవ త్రైమాసికం చివరి నాటికి 8,617కి చేరుకుంది.  గత సంవత్సరం ఇదే కాలంలో 6,063గా ఉంది. ఇది పర్యాటక వసతి సేవలకు పెరుగుతున్న డిమాండ్ , ఈ కీలకమైన రంగంలో పెట్టుబడుల విస్తరణను ప్రతిబింబిస్తుందని అన్నారు.

అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రాంతాల జాబితాలో రియాద్ ప్రాంతం 3,216తో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత మక్కా 3,047, తూర్పు ప్రావిన్స్ 721, మదీనా 515 ఉన్నాయి.  హాస్పిటాలిటీ యూనిట్ రిజర్వేషన్ కార్యకలాపాలు కూడా వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్యలో 32 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.  2025 రెండవ త్రైమాసికంలో 5,099 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.  ఇది 2024లో ఇదే కాలంలో 3,850గా ఉంది. మక్కా 2,027 రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో ఉంది.  రియాద్ 1,939, మదీనా 410, తూర్పు ప్రావిన్స్ 374, అల్-ఖాసిమ్ ప్రాంతం 81తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో 80,000 కంటే ఎక్కువ వాణిజ్య రిజిస్ట్రేషన్లను జారీ చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  దీనితో రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో మొత్తం సంఖ్య 1.7 మిలియన్లకు పైగా వాణిజ్య రికార్డులకు చేరుకుందని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com