అల్ అన్సారీ చెల్లింపుల్లో జాప్యం..ప్రవాసుల్లో ఆందోళన..!!

- July 08, 2025 , by Maagulf
అల్ అన్సారీ చెల్లింపుల్లో జాప్యం..ప్రవాసుల్లో ఆందోళన..!!

యూఏఈ: అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ ద్వారా పంపిన అమౌంట్ ఇంకా తమ కుటుంబాలకు చేరలేదని కొందరు యూఏఈ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 7న పంపిన అమౌంట్ తమ కుటుంబాలకు ఇంకా అందలేదని చెప్పారు. నిమిషాల్లో పూర్తి కావాల్సిన NEFT (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) లావాదేవీలు కొంతమంది కస్టమర్లకు 48 గంటలకు పైగా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.  కాగా, టెక్నికల్ సమస్య కారణంగా జరిగిన ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలియవస్తుంది.   

“నేను దుబాయ్‌లోని అల్ అన్సారీ బ్రాంచ్‌కు కాల్ చేసాను.  సిబ్బంది తమకు కొన్ని ‘సాంకేతిక సమస్యలు’ ఎదురయ్యాయని తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని వారు హామీ ఇచ్చారు.” అని దుబాయ్‌కు చెందిన భారతీయ నివాసి పేర్కొన్నారు.

'చిన్న సాంకేతిక సమస్య'
అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ వీటిపై స్పందించింది.  “జూలై 5న అల్ అన్సారీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఒక టెక్నికల్ సమస్యను నిపుణులు గుర్తించారు. అది ఆర్థిక లావాదేవీల ప్రాసెసింగ్‌ను ప్రభావితం చేసింది.  దీని ఫలితంగా కస్టమర్ ఖాతాలకు సంబంధించి సమస్యలు తలెత్తాయి. చాలా వరకు సమస్యలను వెంటేనే పరష్కరించాము. మరికొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా సరిచేస్తున్నాము. ” అని అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ తెలిపింది.

ఫిలిప్పీన్స్ ప్రవాసికి చెందిన మార్లన్ మాట్లాడుతూ.. జూలై 5న ఫిలిప్పీన్స్‌కు డబ్బు పంపడంలో జాప్యం ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. దురదృష్టవశాత్తు తన కొడుకు స్కూల్ ఫీజు చెల్లించడానికి గడువు ముగిసిందన్నారు. ఆలస్యం కారణంగా స్కూల్ జరిమానా విధించింది అని వాపోయాడు. తన తల్లి వైద్య ఖర్చుల కోసం డబ్బు పంపడంలో ఆలస్యం ఎదురైందని, దాంతో చాలా సమస్యలు వచ్చాయని దుబాయ్‌కు చెందిన కెన్యాకు చెందిన జీ పేర్కొన్నారు.    

యూఏఈలో అతిపెద్ద రెమిటెన్స్,  ఫారిన్ ఎక్స్ఛేంజ్ కంపెనీగా అల్ అన్సారీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పిజెఎస్‌సి గుర్తింపు పొందింది. ఇది ఇండియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్, యూకే మరిన్నింటితో సహా అనేక ఇతర దేశాలకు తక్షణ ఆన్‌లైన్ డబ్బు బదిలీలను అందిస్తుంది. అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ 260 కంటే ఎక్కువ శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. వారు ప్రతి నెలా 3 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తారు.    

అమెరికా, సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద రెమిటెన్స్‌లను పంపే దేశం యూఏఈ. గత సంవత్సరం, యూఏఈలో ఉన్న భారతీయ ప్రవాసులు భారతదేశానికి $21.6 బిలియన్లను పంపారు. ఇది మొత్తం డాలర్ ఇన్‌ఫ్లోలలో 19.2 శాతానికి సమానం. యూఎస్ తర్వాత ప్రపంచ రెమిటెన్స్‌లో యూఏఈ రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com