యాపిల్‌ సీవోవోగా భారత సంతతి చెందిన సబిహ్ కాన్‌

- July 09, 2025 , by Maagulf
యాపిల్‌ సీవోవోగా భారత సంతతి చెందిన సబిహ్ కాన్‌

అమెరికా: ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇప్పుడు తన ఆపరేషన్స్ బాధ్యతల్ని ఒక భారతీయ మూలాలున్న నాయకుడి చేతుల్లోకి అప్పగించింది.సబిహ్ ఖాన్ కొత్త COO గా నియమించింది.ఇది కేవలం ఒక ఉద్యోగ నియామకమే కాదు.ఆపిల్ లో ఓ భారతీయుడు మరింత బలంగా కనిపించడానికి ఇది ఒక బీజం కూడా.చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (COO) జెఫ్‌ విలియమ్స్ కంపెనీని వీడనున్నారు.ఈ క్రమంలోనే ఈ బాధ్యతలను యాపిల్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ సబిహ్ కాన్‌కు అప్పగించనున్నారు.జులై చివర్లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇక డిజైనింగ్ టీమ్ బాధ్యతలను నేరుగా టీమ్‌కుక్‌ స్వీకరించనున్నారు.

సబిహ్‌ ఖాన్‌కు యాపిల్ సంస్థలో 30 ఏళ్ల అనుభవం
భారతీయ మూలాలున్న సబిహ్‌ ఖాన్‌కు యాపిల్ సంస్థలో 30 ఏళ్ల అనుభవం ఉంది. గత ఆరేళ్ల నుంచి ఆయన యాపిల్ గ్లోబెల్ సప్లై ఛైన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉత్పత్తి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే సబిహ్ ఖాన్‌ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లాలో జన్మించారు. అక్కడ అయిదవ తరగతి వరకు ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత ఖాన్ కుటుంబం సింగపుర్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడ ఆయన పాఠశాల విద్యాభ్యాసం ముగిశాక.. వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది.

ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఆయన బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పట్టా కూడా అందుకున్నారు.1995లో ఆయన యాపిల్ ప్రొక్యూర్‌మెంట్‌ గ్రూప్‌లో కూడా పనిచేశారు. అంతకుముందు జీఈ ప్లాస్టిక్స్‌లో డెవలప్‌మెంట్ ఇంజినీర్, అకౌంట్‌ టెక్నికల్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (COO) బాధ్యతలు అందుకోనున్నారు. టిమ్ కుక్ ఆయనను “బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్”గా, ఆపిల్ సరఫరా వ్యవస్థకు కేంద్ర శిల్పిగా ప్రశంసించారు. అధునాతన తయారీ విధానాలు, అమెరికాలో ఉత్పత్తి విస్తరణ, పర్యావరణ స్థిరత్వం (కార్బన్ ఉద్గారాలను 60% తగ్గించడం) వంటి రంగాల్లో ఆయన నాయకత్వాన్ని కొనియాడారు.

సబిహ్ ఖాన్ ఎక్కడివాడు?
ఖాన్ 1966లో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించాడు. అతను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు అతని కుటుంబం సింగపూర్‌కు వెళ్లింది.
ఆపిల్ సీఈఓ జీతం ఎంత?
 ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ 2024లో మొత్తం $74.6 మిలియన్ల పరిహారాన్ని పొందారు, ఇందులో ఆయన మూల వేతనం, స్టాక్ అవార్డులు.
ఆపిల్‌లో అత్యధిక జీతం పొందే వ్యక్తి ఎవరు?
టిమ్ కుక్
ఆపిల్‌లో అత్యధిక జీతం పొందే ఉద్యోగి టిమ్ కుక్, అతని పరిహారం ఎక్కువగా కొన్ని సంవత్సరాలలో $100 మిలియన్లకు పైగా ఉన్న స్టాక్ అవార్డులపై ఆధారపడి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com