మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- February 09, 2026
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS), బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని ప్రజలు అలోచించి ఓటేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ పాలనను, తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనను బేరీజు వేసుకొని ఓటేయాలని అన్నారు సీఎం రేవంత్.
కేంద్రంలో గత 11ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలు చేసిందేమీ లేదని అన్నారు.హైదరాబాద్ కు వరద నష్టాన్ని ఇప్పటికీ కేంద్రం ఇవ్వలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని బండి సంజయ్ అంటున్నారని 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారో ముందు చెప్పాలని గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.గత ప్రభుత్వాలు ఏం చేయలేదని, రెండేళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ఎన్నో హామీలు నెరవేర్చిందని చెప్పారు. ఓటు వేసే ముందు ఓటర్లు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







