'ది పారడైజ్'- ఆర్ఎఫ్సీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్
- July 09, 2025
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ది పారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం మరోసారి చేతులు కలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. స్పెషల్ గా వేసిన మ్యాసీవ్ సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్విజన్లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా ఉండనుంది.
'ది పారడైజ్’ గ్లోబల్ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ 8 భాషలలో విడుదల కానుంది.
టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఉన్న పవర్ఫుల్ డైలాగ్, విజువల్స్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్, నాని స్ట్రాంగ్ ఎంట్రీ... ఇవన్నీ సినిమా పై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
మార్చి 26, 2026న ‘ది పారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: నాని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







