వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్.. కువైట్ కు గల్ఫ్‌లో రెండవ స్థానం..!!
- July 10, 2025
కువైట్: 2025 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో కువైట్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 30వ స్థానంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత గల్ఫ్‌లో రెండవ స్థానంలో నిలిచింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ వెల్-బీయింగ్, గాలప్, యూఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్‌తో కలిసి ప్రచురించిన ఈ నివేదిక.. 2022 నుండి 2024 వరకు ప్రజల జీవితాలను అంచనా వేసి, వాటి ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది.
సోషల్ యూనిటీ, చారిటీ, పబ్లిక్ ట్రస్ట్ వంటి రంగాలలో కువైట్ తన స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇవి నివేదికలో కువైట్ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి దోహదపడింది. ఛారిటీ విషయంలో ఇది ప్రపంచంలో 33వ స్థానంలో, స్వచ్ఛంద సేవకు 46వ స్థానంలో.. స్ట్రేంజర్స్ కు సహాయం చేయడంలో 27వ స్థానంలో నిలిచింది.
ఇక యూఏఈ అరబ్ ప్రపంచంలో మొదటి స్థానంలో.. ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచి, హ్యాపీ, చారిటీ, స్వచ్ఛంద సేవలో గల్ఫ్‌ను ముందుండి నడిపించింది. సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా 32వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత లిబియా, అల్జీరియా, జోర్డాన్, ఈజిప్ట్ వంటి ఇతర అరబ్ దేశాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
కువైట్ బలమైన పనితీరు, జీవన నాణ్యత, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సమాజ విలువల మధ్య సమతుల్యత మెరుగైన స్థానం పొందేందుకు దోహదం చేసిందని నివేదిక హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక