ఫిన్‌టెక్ సేవలకు జీసీసీ హబ్‌గా బహ్రెయిన్..గ్లోబల్ నివేదిక వెల్లడి..!!
- July 10, 2025
మనామా: ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కొత్త నివేదిక ప్రకారం.. టెక్ హబ్‌లతో ఆర్థిక సేవల సంస్థలను నడపడానికి గల్ఫ్‌లో అత్యంత కాస్ట్ –ఎపిషియెన్సీ గమ్యస్థానంగా బహ్రెయిన్ నిలిచింది. "జీసీసీలో వ్యాపారం చేయడం ఖర్చు - ఫైనాన్షియల్ సర్వీసెస్" అనే పేరుతో నివేదికను విడుదల చేశారు. ఇతర GCC దేశాలతో పోలిస్తే బహ్రెయిన్ 48% వరకు తక్కువ ఆపరేషన్ ఖర్చులను కలిగిఉందని హైలైట్ చేసింది.
బహ్రెయిన్‌లోని ఫిన్‌టెక్ కేంద్రాల వార్షిక కార్మిక ఖర్చులు జీసీసీ సగటు కంటే 24% తక్కువని, బిజినెస్ లైసెన్సింగ్ ఫీజులు ప్రాంతీయ ప్రతిరూపాల కంటే 85% తక్కువగా ఉంటాయని తెలిపారు. కార్యాలయ అద్దె ఖర్చులు 60% వరకు మెరుగైన విలువను అందిస్తాయన్నారు. ఇక ఆఫీస్ స్పేస్ ఖర్చులు, ప్రతిభ ఆకర్షణ, లైసెన్సింగ్, పన్నులు, వీసా/వర్క్ పర్మిట్ ఖర్చులు వంటి కీలక ఆర్థిక అంశాలను అధ్యయనం చేసి విశ్లేషించి ర్యాంకులను కేటాయించారు.
బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అలీ అల్ ముదైఫా మాట్లాడుతూ.. "డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని కొనసాగించడానికి ఆర్థిక సంస్థలు టెక్ హబ్‌లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి. తక్కువ ఖర్చులు, బలమైన మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా బహ్రెయిన్ ఈ ప్రాంతంలో ముందంజలో ఉంది." అని హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు, బహ్రెయిన్ ఆర్థిక, సాంకేతిక ప్రతిభకు ప్రాధాన్యత కలిగిన ప్రాంతీయ కేంద్రంగా వేగంగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ ప్రకారం, ఇది నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో.. డిజిటల్, సాంకేతిక నైపుణ్యాలకు 6వ స్థానంలో ఉంది.
బహ్రెయిన్ ఫిన్‌టెక్ ప్రతిభ ఎక్కువగా డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, వెబ్ టెక్నాలజీలలో కేంద్రీకృతమై ఉందని EY నివేదిక పేర్కొంది. ఇవి ఆర్థిక సాంకేతిక కేంద్రాలలో సగానికి పైగా వర్క్ ఫోర్సును కలిగి ఉన్న రంగాలు అని తెలిపింది. బహ్రెయిన్ ఆర్థిక ఆవిష్కరణ, డిజిటల్ మార్పులు ప్రాంతీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేస్తుందని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక