అమెరికా సుంకాల ఎఫెక్ట్.. గ్రాముకు Dh2.5 పెరిగిన బంగారం ధరలు..!!
- July 10, 2025
దుబాయ్: అమెరికా సుంకాల కారణంగా ప్రపంచ ధరలు ఔన్సుకు $3,300 కంటే ఎక్కువగా పెరగడంతో గురువారం ఉదయం దుబాయ్‌లో బంగారం గ్రాముకు Dh2.5 పెరిగి Dh400 కంటే ఎక్కువగా ఉంది. 24K ధరలు గ్రాముకు Dh2.5 పెరిగి Dh400.25కి చేరుకోగా, 22K, 21K మరియు 18K వరుసగా Dh370.75, Dh355.5 మరియు Dh304.5 వద్ద ప్రారంభమయ్యాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,323.59 వద్ద 0.33 శాతం పెరిగి ట్రేడవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య భాగస్వాములపై కొత్త సుంకాలను విధించారు. జపాన్, దక్షిణ కొరియా నుండి దిగుమతులపై 25 శాతం సుంకాలు.. చిన్న ఆసియా ఆర్థిక వ్యవస్థలు, దక్షిణాఫ్రికాతో సహా మరో 12 దేశాల వస్తువులపై 25-40 శాతం సుంకాలు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. రాగి దిగుమతులపై కొత్త 50 శాతం సుంకాన్ని, బ్రెజిల్ నుండి వస్తువులపై 50 శాతం సుంకాన్ని ఆగస్టు 1 నుండి అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
ట్రంప్ ప్రకటనతో మార్కెట్ లో అస్థిరత పెరిగే అవకాశం ఉందని, కానీ తాజా పరిణామాలు వాణిజ్య యుద్ధంలో పెరుగుదలను సూచించదని UBS గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మార్క్ హేఫెల్ అన్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







