వియన్నాలో OPEC సెమినార్‌.. ఇండియా- కువైట్ చర్చలు..!!

- July 10, 2025 , by Maagulf
వియన్నాలో OPEC సెమినార్‌.. ఇండియా- కువైట్ చర్చలు..!!

కువైట్: జూలై 9వ తేదీ బుధవారం వియన్నాలో జరిగిన 9వ OPEC అంతర్జాతీయ సెమినార్ సందర్భంగా భారత్, కువైట్ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కువైట్ చమురు మంత్రి,  చైర్మన్ తారెక్ సులైమాన్ అల్-రౌమి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రెండు దేశాల ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారు. ముడి చమురు సరఫరాదారులలో 6వ అతిపెద్ద దేశంగా, LPG 4వ అతిపెద్ద వనరుగా.. 8వ అతిపెద్ద హైడ్రోకార్బన్ వాణిజ్య భాగస్వామిగా భారతదేశానికి కువైట్ కీలక ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com