ముగిసిన NATS 8వ తెలుగు సంబరాలు
- July 10, 2025
అమెరికా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి.మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు. వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది.మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషిచేశారు.అంతేకాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు.
ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీలతో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు.థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు…తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేల నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి…
నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి…హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ…ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలు తెలియజేశారు.ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20వేల మందికి పైగా హాజరయ్యారు…నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్ చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు..
సంబరాలే కాక సామాజిక బాధ్యతగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది.ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు..అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!