156 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి..

- July 14, 2016 , by Maagulf
156 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి..

యుద్ధంతో అట్టుడుకుతున్న దక్షిణ సూడాన్‌ నుంచి 156 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. సీ-17 సైనిక విమానంలో 156మంది భారత్‌కు చేరుకున్నారు. అక్కడ చిక్కుకుపోయిన 600 మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సంకటమోచన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. సూడాన్‌లోని జుబా నుంచి వీరు ఈరోజు ఉదయం కేరళలోని తిరువనంతపురం చేరుకున్నారు. భారతీయులను తీసుకొచ్చేందుకు సూడాన్‌ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ కూడా వచ్చారు. భారత్‌ చేరుకున్న వారిలో ఇద్దరు నేపాలీలు కూడా ఉన్నారు. .కేరళ, తమిళనాడుకు చెందిన ప్రయాణికులను తిరువనంతపురంలో దించిన తర్వాత మిగిలిన ప్రయాణికులతో విమానం దిల్లీ చేరుకుంది. మరికొందరు భారతీయులతో రెండో విమానం జుబా నుంచి బయలుదేరనుంది. కొందరు వ్యాపార అవసరాల దృష్ట్యా అక్కడే ఉండేందుకు మొగ్గు చూపారని.. అయితే ముందు రక్షణ ముఖ్యమని.. వ్యాపారం తర్వాతని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు వీకే సింగ్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com