'ఆంధ్రా కింగ్ తాలూకా' షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం
- July 11, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
నెల రోజుల కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన సెట్లో ప్రారంభమైంది. ప్రస్తుతం, రామ్, భాగ్యశ్రీ బోర్సే పై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీం20 రోజులు డే టైంకి షూటింగ్ షిఫ్ట్ అవుతుంది. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలని పెంచింది.
టాప్ టెక్నిషియన్స్ తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా పని చ్దేస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.
ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్ పూర్తయిన తర్వాత మేకర్స్ ప్రమోషన్స్ జోరుని మరింతగా పెంచునున్నారు.
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్
సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి.
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ - మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!