దుబాయ్ లో అరబ్ వ్యక్తికి 3 ఏళ్ల జైలు శిక్ష, 247,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- July 11, 2025
యూఏఈ: నైఫ్‌లోని ఒక టూరిజం కంపెనీ కార్యాలయంలో ఇటీవల జరిగిన సాయుధ దోపిడీలో పాల్గొన్నందుకు M.A.K. గా గుర్తించిన 48 ఏళ్ల అరబ్ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, 247,000 దిర్హామ్‌ల జరిమానా విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని బహిష్కరించాలని ఆదేశించిన కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ గతంలో జారీ చేసిన తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
కేసు రికార్డుల ప్రకారం.. అరబ్ జాతీయుడైన నిందితుడు మరో ఐదుగురితో కలిసి కంపెనీలో చోరీకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ సంవత్సరం మార్చిలో జరిగింది. కంపెనీ యజమాని తన ఆఫీసు తలుపును ఒక వ్యక్తి తట్టాడని, యజమాని తలుపు తెరిచిన తర్వాత, ఆరుగురు వ్యక్తులు బలవంతంగా లోపలికి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దుండగులలో ఒకరు బాధితుడి నుండి తాళం తీసుకొని సేఫ్ తెరిచి, Dh247,000 దొంగిలించి, మిగిలిన వారితో అక్కడి నుండి పారిపోయారు.
దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ప్రధాన నిందితుడిని గుర్తించి ట్రాక్ చేసి మరొక ఎమిరేట్‌లో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆఫ్రికా కు చెందిన మిగిలిన అనుమానితులు తనను చోరీలో పాల్గొనమని బలవంతం చేశారని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!