‘గదాధారి హనుమాన్’ టీజర్ రిలీజ్..
- July 11, 2025
విరభ్ స్టూడియో బ్యానర్ పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మాణంలో రోహిత్ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గదాధారి హనుమాన్’. మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీగా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రవి కిరణ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర.. పలువురు అతిథులుగా విచ్చేశారు.
ఈ ఈవెంట్లో నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. హనుమాన్ సినిమాను నేనే ప్రారంభించాను. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. రవి కిరణ్ ఇది వరకే నాకు కథ చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోంది. ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నాయి అని అన్నారు.
హీరో రవి కిరణ్ మాట్లాడుతూ.. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మా సినిమాలో మ్యూజిక్, బీజీఎం, విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నాను అని తెలిపారు.
నిర్మాత రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి మాట్లాడుతూ.. మా డైరెక్టర్ రోహిత్ గారి విజన్‌కు తగ్గట్టుగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో ఈ సినిమాని అద్భుతంగా నిర్మించాం. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే సినిమాని తీసుకొస్తాం అని తెలిపారు. డైరెక్టర్ రోహిత్ కొల్లి మాట్లాడుతూ.. గదాధారి హనుమాన్ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశాను. చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో మూవీ అనుకున్నాం కానీ మా రవి గారు జాయిన్ అవ్వడంతో స్పాన్ మారిపోయింది. ఇప్పుడు ఇలా పాన్ ఇండియా స్థాయిలో మూవీని తీసుకు వస్తున్నాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ ఫుల్ అన్న దానిపై ఓ సీక్వెన్స్ కూడా మా సినిమాలో ఉంటుంది అని తెలిపారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!