ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- July 13, 2025
హైదరాబాద్ | టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తెల్లవారుజామున ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
కోట నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు..
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న నటులలో కోటా శ్రీనివాసరావు ఒకరు. కమెడియన్ గా విలన్ గా ఈయన చేసిన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కొన్ని సినిమాలకు అవార్డులను కూడా అందుకున్నారు. 750 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు
1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు.4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







