తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి

- July 13, 2025 , by Maagulf
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఘటన మేడిపల్లిలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసమైంది. దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు, విషయం తీవ్రతను పెంచింది.

కాల్పులు జరిపిన గన్‌మెన్
ఈ క్రమంలో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. జాగృతి కార్యకర్తల దాడిలో మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్‌ ధ్వంసం అయింది. మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపిస్తున్నారు. అయితే జాగృతి నేతల దాడి సమయంలో మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు.

దాడికి కారణమైన వ్యాఖ్యలు
శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మల్లన్న కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌తో కవితకు ఏం సంబంధం..? మీకు మాకు ఏమైనా కంచం పొత్తా అంటూ మల్లన్న వ్యాఖ్యానించారు. మేం రిజర్వేషన్లు అమలు చేస్తుంటే.. మీరు పండగచేసుకోవడం ఏంటో అర్థం కావడంలేదంటూ మల్లన్న ప్రసంగించారు. ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న జాగృతి శ్రేణులు.. ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ కొనసాగుతోంది.

రాజకీయంగా పెరుగుతున్న ఉద్రిక్తత
ఈ ఘటనతో మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ దాడిలో జాగృతి కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యే అవకాశముంది. మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com