దుబాయ్లో ఆర్టిఫిషియల్ రిఫ్స్.. సముద్ర జీవుల పునరుద్ధరణ..!!
- July 13, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా సముద్ర జీవులు పునరుద్ధరణకు, స్థానిక పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి దుబాయ్ పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ రిఫ్స్ నిర్మాణాల వైపు మొగ్గు చూపుతోంది. దుబాయ్లో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును నిశితంగా పరీక్షిస్తున్నారు. 2021, 2023 మధ్య రెండేళ్ల అధ్యయనంలో యూఏఈ జలాల్లో 40 రీఫ్ మాడ్యూల్లను ఏర్పాటు చేశారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వచ్చాయని అన్నారు. బార్నాకిల్స్, బివాల్వ్లు, స్పాంజ్లతో సహా 17 జాతుల సముద్రజీవులలో పెరుగుదల ఆశించినస్థాయిలో నమోదైంది.
“సముద్ర జీవవైవిధ్యం 10%, చేపల బయోమాస్లో ఎనిమిది రెట్లు పెరుగుదలకు ముందస్తు సూచికలను కూడా ఈ అధ్యయనం చూపించింది. చివరికి ఇది స్థానిక సముద్ర జీవవైవిధ్యాన్ని పెంచుతుంది. ” అని దుబాయ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అథారిటీ (DECCA) డైరెక్టర్ జనరల్ అహ్మద్ మొహమ్మద్ బిన్ థాని అన్నారు. రీఫ్ మాడ్యూళ్ల ఉత్పత్తి ఆగస్టు 2024 లో ప్రారంభమైంది.
దుబాయ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అథారిటీ ప్రకారం.. ప్రతి మాడ్యూల్ 100 సంవత్సరాలకు పైగా ఉండేలా రూపొందించారు. ఇది సముద్ర జీవులు వృద్ధి చెందడానికి దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2024 లో ప్రారంభించిన దుబాయ్ రీఫ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రీఫ్ ప్రాజెక్టులలో ఒకటిగా మారుతుంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







