ప్రమాదాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం..Dh1,000 ఫైన్..!!
- July 13, 2025
యూఏఈ: యూఏఈలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు, దానినిచూసేందుకు వాహనాలు ఆపితే భారీగా జరిమానాలు విధించనున్నారు. సంఘటనతో సంబంధం లేని ఇతర వాహనదారులు ఆపకూడదని లేదా ఏ విధంగానూ వేగాన్ని తగ్గించకూడదని సలహా జారీ చేశారు. దీని కారణంగా గాయపడినవారికి చికిత్స చేయడానికి వెళ్లే అంబులెన్స్ లను ఆలస్యం చేసే అవకాశం ఉందని, ఇది ప్రాణనష్టానికి దారితీయవచ్చని తెలిపింది. అదే విధంగా ఇది ఇతర డ్రైవర్ల ప్రయాణాన్ని కూడా ప్రభావితం చేయవచ్చన్నారు.
యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం "ట్రాఫిక్ ప్రమాదాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం" కోసం మొత్తం 630 ఉల్లంఘనలు జారీ చేశారు. వీటిలో ఎక్కువ భాగం దుబాయ్‌లో నమోదయ్యాయి. ఆ తర్వాత అబుదాబిలో 87, దుబాయ్‌లో 411, షార్జాలో 71, అజ్మాన్‌లో 4, రస్ అల్ ఖైమాలో 30, ఉమ్ అల్ క్వైన్‌లో 27 చొప్పున ఉన్నాయి.
"ఏ విధంగానైనా" ట్రాఫిక్‌ను అడ్డుకోవడం చేస్తే 500 దిర్హామ్‌ల జరిమానా విధిస్తారు. అయితే "అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు లేదా అధికారిక కాన్వాయ్‌లకు దారి ఇవ్వకపోవడం" పరిస్థితి తీవ్రత కారణంగా తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. దీనికి 30 రోజుల వాహనం సీజ్, ఆరు ట్రాఫిక్ పాయింట్లుతో పాటు 3,000 దిర్హామ్‌ల భారీ జరిమానా విధించనున్నారు.
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ విభాగాలు గత సంవత్సరం అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు లేదా అధికారిక కాన్వాయ్‌లకు దారి ఇవ్వనందుకు డ్రైవర్లపై 325 ఉల్లంఘనలను జారీ చేశాయి.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!