ఐహెచ్‌సీ సంస్థ పేరు, లోగోను ఉపయోగించి ఆన్‌లైన్ స్కామ్..!!

- July 13, 2025 , by Maagulf
ఐహెచ్‌సీ సంస్థ పేరు, లోగోను ఉపయోగించి ఆన్‌లైన్ స్కామ్..!!

యూఏఈ: యూఏఈలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్‌సి) పేరు, లోగో పేరుతో ఆన్ లైన్ స్కామ్ కు పాల్పడుతున్నట్లు కంపెనీ హెచ్చరించింది. జాబ్స్ పేరుతో ఇప్పటికే అనేక మందిని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ స్కామర్లు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ వివరాలు వంటి యుఏఈ నివాసితుల వ్యక్తిగత, ఆర్థిక వివరాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని అబుదాబిలో కంపెనీ ప్రధాన కార్యాలయం హెచ్చరించింది.  

"కంపెనీ పేరు, ఉద్యోగి పేర్లు, కంపెనీ లోగోను స్కామర్లు ఆన్‌లైన్‌లో మోసపూరిత పెట్టుబడి అవకాశాలు, ఉద్యోగాల కోసం ఉపయోగిస్తున్నారు. ఫీజు లేదా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి వ్యక్తులు/సంస్థలను వ్యక్తిగత, వ్యాపార సమాచారం, క్రెడిట్ కార్డ్ /లేదా బ్యాంక్ వివరాలను అందించమని అడుగుతున్నారని IHC ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటోంది." అని కంపెనీ అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్‌కి ఒక ప్రకటనలో తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com