రాష్ట్రపతి ఎస్కార్ట్‌ కారు డార్జిలింగ్‌ లోయలో పడిపోయింది

- July 15, 2016 , by Maagulf
రాష్ట్రపతి ఎస్కార్ట్‌ కారు  డార్జిలింగ్‌ లోయలో  పడిపోయింది

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం సంభవించింది. ఆయన ఎస్కార్ట్‌ కారు డార్జిలింగ్‌లోని ఓ లోయలో పడిపోయింది. ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురు భద్రతాసిబ్బందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. డార్జిలింగ్‌ మీదుగా కాన్వాయ్‌ వెళ్తుండగా మూలమలుపులో కారు అదుపు తప్పి లోయలో పడింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కాన్వాయ్‌ వెనకాలే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కాన్వాయ్‌ ఉంది. మమతా బెనర్జీ సహా ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌, కుమార్తె శర్మిష్ఠ కూడా దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com