భారతదేశపు మొట్టమొదటి ఈ-స్కూటర్ టియర్‌డౌన్‌ను ఆవిష్కరించిన ఆంపియర్

- July 14, 2025 , by Maagulf
భారతదేశపు మొట్టమొదటి ఈ-స్కూటర్ టియర్‌డౌన్‌ను ఆవిష్కరించిన ఆంపియర్

బెంగుళూరు: ఇలెక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో ముందుండే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన బ్రాండ్ ఆంపేర్, భారతదేశంలో తొలి ఈ-స్కూటర్ టియర్‌డౌన్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఈ-స్కూటర్ ఆంపేర్ నెక్సస్ యొక్క అంతర్గత నిర్మాణం, టెస్ట్ ప్రోటోకాల్స్‌కి సంబంధించిన అద్భుతమైన ఇంజినీరింగ్ వివరాలు తెలియజేయబడ్డాయి.

ఈ విజన్‌తో, ఇండియాలో తమ R&D (రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) మరియు వాలిడేషన్ ప్రక్రియలను ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా, ఆంపేర్ ముందుగా నిలిచిన అరుదైన OEM (Original Equipment Manufacturer)లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

50,000 కిలోమీటర్లకు పైగా రియల్-వర్డ్ టెస్టింగ్ చేసిన నెక్సస్, ఖచ్చితమైన ఇంజినీరింగ్, సేఫ్టీ, మరియు ఎండ్యూరెన్స్ లక్షణాలను ప్రతిబింబిస్తుంది.ఇండియన్ రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, డ్యూయల్ క్రేడిల్ ఫ్రేమ్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ఆర్కిటెక్చర్, స్మార్ట్ BMS, మరియు రగ్గడ్ సస్పెన్షన్ వంటి అంశాలను నెక్సస్‌లో జోడించడం జరిగింది.

ఈ వీడియోలో ఆంపేర్ సీనియర్ ఇంజినీరింగ్ మరియు ప్రొడక్ట్ లీడర్లు నెక్సస్ నిర్మాణ విధానాన్ని వివరిస్తూ, తమ డేటా ఆధారిత, స్ట్రెస్ టెస్టింగ్ విధానాన్ని చూపించారు.

భద్రత, ప్రయాణ నాణ్యత, మరియు ఆయుష్షు—ఇవే నెక్సస్ యొక్క మూల ఆధారాలుగా నిలుస్తున్నాయి.నెక్సస్ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసేందుకు టియర్‌డౌన్ స్థాయిలో ఆధారాలు చూపించడం ద్వారా, ఆంపేర్ తన ప్రీమియం ఫ్యామిలీ EV సెగ్మెంట్లో మళ్లీ తన స్థానం పటిష్టం చేసుకుంది.

ఈ పారదర్శకత ఆంపేర్‌కు బోనస్‌గా మారింది—2025 బైక్ ఇండియా అవార్డ్స్‌లో “ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్”గా నెక్సస్ అవార్డును గెలుచుకుంది. అలాగే మార్చి నెలలో 6,000కు పైగా యూనిట్లు అమ్ముడవడంతో 52 శాతం నెలవారీ వృద్ధి, జనవరిలో 53 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.

తమ ఆర్&డి ప్రమాణాలను ప్రజల ముందుంచిన తొలి భారతీయ EV తయారీదారులలో ఒకటిగా నిలిచిన ఆంపేర్, గ్రాహకుల నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని చిత్తర్వు ససూన్(Head of Vehicle Engineering and Development) తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com