బాబు బంగారం' ఆడియో, చిత్ర విడుదల తేదీలు ఖరారు

- July 15, 2016 , by Maagulf
బాబు బంగారం' ఆడియో, చిత్ర విడుదల తేదీలు ఖరారు

విక్టరీ వెంకటేశ్‌, నయనతార జంటగా రూపుదిద్దుకుంటున్న 'బాబు బంగారం' ఆడియో, చిత్ర విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఈ చిత్రం ఆడియోను జులై 24న, సినిమాను ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు మారుతి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, అందరి ఆశీస్సులు కావాలని ట్వీట్‌ చేశారు.తాజాగా ఈ చిత్రం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో వెంకటేశ్‌ కూరగాయలు మోస్తూ కనిపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల తర్వాత నయనతార, వెంకటేశ్‌ జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమిది. పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజి, సోనమ్‌ బజ్వా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com