ఎల్లుండే నిమిష ప్రియాకు ఉరిశిక్ష..

- July 14, 2025 , by Maagulf
ఎల్లుండే నిమిష ప్రియాకు ఉరిశిక్ష..

యెమెన్: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియాకు యెమెన్‌లో మరణశిక్ష అమలు ముప్పు పొంచి ఉంది. 2017లో యెమెన్ వ్యక్తి మెహదీని హత్య చేసిన కేసులో ఆమెకు ఉరిశిక్ష విధించారు. నిమిష తన పై లైంగికంగా వేధిస్తున్నాడని మెహదీని మందు కలిపిన పానీయంతో మత్తెక్కించి, ప్రమాదవశాత్తు మృతి చెందేలా చేసిందని ఆరోపణలున్నాయి. ఆ కేసులో అక్కడి న్యాయవ్యవస్థ ఆమెకు ఉరిశిక్ష విధించగా, అది జూలై 18న, అంటే ఎల్లుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

నిమిష ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి.నిమిష తల్లి పక్షాన క్షమాభిక్ష కోరుతూ మెహదీ కుటుంబాన్ని కలుసుకోవడానికి యెమెన్‌కు వెళ్లే అవకాశం ఇవ్వమని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం, ఇప్పుడు శిక్షను ఆపగల సమర్థత ఉన్న ఏకైక మార్గం మెహదీ కుటుంబం క్షమించడమే. కేంద్రం తరపున అన్ని నిబంధనలకు లోబడి అవసరమైన దౌత్య చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

యెమెన్ శరీయత్ చట్టాల ప్రకారం, హత్య కేసులో బాధిత కుటుంబం క్షమించకపోతే మరణశిక్ష తప్పదు. ప్రస్తుతం నిమిష ప్రాణాలు కేవలం మెహదీ కుటుంబం నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ రెండు రోజులలో వాళ్లు క్షమాభిక్ష తెలుపితే మాత్రమే ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ కేసు నిమిత్తం ప్రజల నుంచి మానవతా దృక్పథంతో స్పందన వస్తోంది. అయితే, చివరి నిర్ణయం మాత్రం బాధిత కుటుంబ చేతుల్లోనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com