సౌదీ అరేబియాలో కార్ డీలర్‌షిప్ ఒప్పందాలపై నియంత్రణ..!!

- July 15, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో కార్ డీలర్‌షిప్ ఒప్పందాలపై నియంత్రణ..!!

రియాద్: సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ, జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ ఇటీవల ఆటోమోటివ్ రంగంలో పెరుగుతున్న సమస్యలపై దృష్టి సారించింది.  ముఖ్యంగా కార్ల పంపిణీ కోసం అదనపు డీలర్‌షిప్ ఒప్పందాల నమోదుకు సంబంధించి అనేక సమావేశాలను నిర్వహించారు. వాణిజ్య మంత్రిత్వ శాఖతో సమన్వయంతో మార్కెట్ ను ప్రభావితం చేసే కొత్త పంపిణీ ఒప్పందాలపై కాంపిటీషన్ అథారిటీ సమీక్షించడం ప్రారంభించింది.   

పోటీ సంస్థల మధ్య నిబంధనలు అమలు,  పోటీ సంస్థలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి సమగ్ర వివరాలతో ఒక గైడ్ లైన్స్ ను విడుదల చేయడానికి కంపెనీల నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు అథారిటీ వెల్లడించింది.  కార్ల అమ్మకాలు, అమ్మకాల తర్వాత సేవలు, విడిభాగాలలో పనిచేసే సంస్థలపై అథారిటీ ఇటీవల జరిపిన దర్యాప్తును అనుసరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  

2023లో మార్కెట్లను ప్రభావితం చేసేలా పోటీ వ్యతిరేక ప్రవర్తనలో పాల్గొన్నందుకు ఏజెంట్లు, పంపిణీదారులు సహా 79 కంపెనీలపై అధికారులు అభియోగాలు నమోదు చేశారు. 64 సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, 15 సంస్థలు సమీక్షలో పరిష్కార ప్రతిపాదనలను సమర్పించాయి. సౌదీ అరేబియాలో కార్ల మార్కెట్ నియంత్రణా పరిశీలన పెరిగినందున ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com