స్పేస్ నుంచి భూమికి చేరుకున్న‌ శుభాన్షు శుక్లా

- July 15, 2025 , by Maagulf
స్పేస్ నుంచి భూమికి చేరుకున్న‌ శుభాన్షు శుక్లా

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్‌ఎస్ ‌(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం భూమికి సుర‌క్షితంగా తిరిగివ‌చ్చారు.. వీరు ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్‌ సోమవారం మధ్యాహ్నం 4.45 గంటలకు ఐఎస్‌ఎస్‌తో (ISS) అన్‌డాకింగ్‌ ప్రక్రియ పూర్తిచేసుకుంది. డ్రాగన్‌ గ్రేస్‌ వ్యోమనౌక దాదాపు 22 గంటలపాటు అంతరిక్షంలో ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో (sea ) దిగింది.

 

మగాములు భూమికి చేరిన తర్వాత శుభాన్షుతో స‌హా మిగిలిన వారిని ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించారు. ఇస్రో జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా క్వారంటైన్ లో ఉంచుతున్నారు. . ఇస్రోకు చెందిన ఫ్లైట్‌ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షించిన అనంత‌రం వారిని బ‌య‌ట‌కు తీసుకువ‌స్తారు.

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. అంత‌రిక్షంలోకి వెళ్లిన రెండో భార‌త వ్యోమ‌గామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్‌ మిషన్‌ కింద సూయజ్‌ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com