సమ్మర్ వర్క్ బ్యాన్ నిబంధన ఉల్లంఘన
- July 15, 2016
వేసవి తాపంతో మధ్యాహ్నం పనిచేసే కార్మికులకు ఉపశమనం కల్పించేలా 'సమ్మర్ వర్క్ బ్యాన్'ని అధికారికంగా విధించినా, దాన్ని పాటించనందుకుగాను 25 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై చర్యలు తీసుకోనున్నారు. లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇన్స్పెక్షన్ మరియు ట్రేడ్ యూనియన్స్ డైరెక్టర్ అహ్మద్ అల్ హేకి మాట్లాడుతూ జులై నుంచి బ్యాన్ చేసిన సమయంలో పనిచేస్తున్న 256 మంది కార్మికుల్ని గుర్తించామని తెలిపారు. మినిస్ట్రీ 1,474 ఇన్స్పెక్షన్ విజిట్స్‌ని నిర్వహించిందని చెప్పారాయన. 25 ఎస్టాబ్లిష్మెంట్స్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించి, వాటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోసం రిఫర్ చేశామని తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఎంప్లాయర్ 500 బహ్రెయినీ దినార్స్ ప్రతి వర్కర్‌కీ జరీమానా చెల్లించవలసి ఉంటుంది. అయితే 98 శాతం కంపెనీలు వర్క్ బ్యాన్‌ని పాటిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత కారణంగా కార్మికులు పనిచేయకుండా ఈ బ్యాన్‌ని అమల్లోకి తెచ్చారు. గత ఏడాది 230 కంపెనీలు ఈ బ్యాన్‌ని ఉల్లంఘించాయి. ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకు ఈ బ్యాన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







