సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ నిబంధన ఉల్లంఘన

- July 15, 2016 , by Maagulf
సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ నిబంధన ఉల్లంఘన


 
వేసవి తాపంతో మధ్యాహ్నం పనిచేసే కార్మికులకు ఉపశమనం కల్పించేలా 'సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌'ని అధికారికంగా విధించినా, దాన్ని పాటించనందుకుగాను 25 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై చర్యలు తీసుకోనున్నారు. లేబర్‌ మరియు సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ ఇన్‌స్పెక్షన్‌ మరియు ట్రేడ్‌ యూనియన్స్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ అల్‌ హేకి మాట్లాడుతూ జులై నుంచి బ్యాన్‌ చేసిన సమయంలో పనిచేస్తున్న 256 మంది కార్మికుల్ని గుర్తించామని తెలిపారు. మినిస్ట్రీ 1,474 ఇన్‌స్పెక్షన్‌ విజిట్స్‌ని నిర్వహించిందని చెప్పారాయన. 25 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించి, వాటిని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ కోసం రిఫర్‌ చేశామని తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఎంప్లాయర్‌ 500 బహ్రెయినీ దినార్స్‌ ప్రతి వర్కర్‌కీ జరీమానా చెల్లించవలసి ఉంటుంది. అయితే 98 శాతం కంపెనీలు వర్క్‌ బ్యాన్‌ని పాటిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత కారణంగా కార్మికులు పనిచేయకుండా ఈ బ్యాన్‌ని అమల్లోకి తెచ్చారు. గత ఏడాది 230 కంపెనీలు ఈ బ్యాన్‌ని ఉల్లంఘించాయి. ఈ ఏడాది ఆగస్ట్‌ 31 వరకు ఈ బ్యాన్‌ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com