సౌదీ అరేబియాలో బరువు తగ్గించే మెడిసిన్లపై హెచ్చరికలు..!!

- July 16, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో బరువు తగ్గించే మెడిసిన్లపై హెచ్చరికలు..!!

రియాద్: ఓజెంపిక్ , మౌంజారో వంటి బరువు తగ్గించే మెడిసిన్లను పర్యవేక్షణ లేకుండా వినియోగించవద్దని సౌదీ జనాభా ఆరోగ్య శాఖ డిప్యూటీ ఆరోగ్య మంత్రి డాక్టర్ అబ్దుల్లా అసిరి  బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.  వీటి వాడకం ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుందన్నారు. అదే సమయంలో తీవ్రమైన ఆహార మార్పులు - తీవ్రమైన కేలరీల పరిమితి లేదా కఠినమైన శాకాహారి ఆహారాలు వంటి డైట్ ప్లాన్లు పోషకాహార అసమతుల్యతకు దారితీస్తాయని డాక్టర్ అసిరి హెచ్చరించారు.    

కొవ్వు,  చికాకు కలిగించే మసాలా అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. బరువు తగ్గడానికి ప్రమాదకర పద్ధతులను ఆశ్రయించకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి నడక, వ్యాయామం వంటి సాధారణ శారీరక శ్రమను వారి దినచర్యలలో చేర్చుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com