షార్జాలో మహిళ మృతి.. భారత్ లో భర్తపై వరకట్న కేసు నమోదు..!!
- July 16, 2025
యూఏఈ: షార్జాలో ఒక మహిళ తన పసికందును చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని కలిచివేసింది. ఈ కేసు విషయమై కేరళలోని కుందార పోలీస్ స్టేషన్లో మృతురాలి భర్త, అతని కుటుంబంపై కేసు నమోదు చేశారు. భర్త కేరళలోని కొట్టాయంకు చెందినవాడు. అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలి తల్లి శైలజ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఆమె కుమార్తె గత కొన్ని సంవత్సరాలుగా వరకట్న వేధింపులతో పాటు మానసిక వేధింపులను ఎదుర్కొంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జూలై 8న షార్జాలోని వారి అపార్ట్మెంట్లో మహిళ, ఆమె ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె చనిపోయి కనిపించారు. మృతురాలు గత ఐదు సంవత్సరాలుగా షార్జాలో నివసిస్తున్నారు. ఆమె భర్త విడాకుల కోసం ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడని , ఆమెను క్రమం తప్పకుండా శారీరక, మానసిక హింసకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, వైవాహిక జీవితం, మానసిక క్షోభ కారణంగా తను సూసైడ్ చేసుకుంటున్నట్లు రాసి ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని షార్జాకు చెందిన సామాజిక కార్యకర్త అబ్దుల్లా కమంపాలం వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







