పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: మంత్రి కందుల దుర్గేష్

- July 16, 2025 , by Maagulf
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ: రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని, విస్తృత ప్రచారం కల్పించి మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు.వెలగపూడి సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని తన పేషిలో ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రస్తుత పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ (DPR) ల తయారీ, క్యారవాన్, హోమ్ స్టే పాలసీ విధివిధానాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు, రీజినల్ సమ్మిట్ లు, శాఖాపరమైన సమావేశాలు, ఇటీవల కుదుర్చుకున్న ఎంవోయూలు, క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ తదితర అంశాలపై మంత్రి దుర్గేష్ అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మాట్లాడుతూ ఏపీలో 25 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు, 50వేల గదుల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, ముంబయిలలో రోడ్ షోలు ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 22 దేవాలయాల్లో టెంట్ సిటీలతో పాటు ఇగ్లూ తరహా ఇళ్ల విషయం ఆలోచించాలన్నారు.

అనంతరం విశాఖపట్నంలోని రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సుందరీకరణ అంశంపై చర్చించారు. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకుల భద్రత, బీచ్ పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలను తొలగించి పర్యాటకులకు అవసరమైన మోలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. లేపాక్షి, లంబసింగి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com