భారత్‌లో టెస్లా వై మోడల్ కారు పై రూ.29 లక్షల పన్ను
- July 16, 2025
అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా భారత్ లోకి తన వై మోడల్ ఈవీ కారు ద్వారా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. టెస్లా ముంబైలో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. తాజాగా ఈ కారుకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో బుకింగ్ చేసుకున్న వారికి వై మోడల్ కారు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ధరపై అందరూ పెదవి విరుస్తున్నారు. దేశంలో రూ.61 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఈ కారు భారత విపణిలోకి ప్రవేశించింది. అయితే అమెరికాలో దీని ధర 37,490 డాలర్లు(సుమారు రూ. 32 లక్షలు)కి అందుబాటులో ఉంది. ఈ ధరల్లోని భారీ వ్యత్యాసంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
అమెరికాలో ఈ కారు ధర రూ.33 లక్షలు
టెస్లా వెబ్‌సైట్ ప్రకారం..ఒక మోడల్ ధర రూ.59.89 లక్షలు కాగా మరొక మోడల్ ధర రూ.67.89 లక్షలు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ ధర చాలా ఎక్కువ. అమెరికాలో ఈ కారు ధర దాదాపు రూ. 33 లక్షలు. టెస్లా ఖరీదైన కారుపై చాలా మంది కోపంగా ఉన్నారు. ఈ కారుపై విధించిన పన్నుపై వినియోగదారులు మండిపడుతున్నారు. కారు ధరలో దాదాపు సగం పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సోషల్ మీడియాలో టెస్లా పేరును TAX-LA అని పిలుస్తున్నారు.
చైనాలో తయారైన కార్లను భారతదేశంలో విక్రయం
వాస్తవానికి చైనాలో పూర్తిగా తయారైన ఈ కారును భారతదేశానికి తీసుకురావడం..అలాగే కొన్ని లగ్జరీ వస్తువులపై పన్ను విధించడం వల్ల దీని ధర చాలా ఎక్కువగా ఉంది. టెస్లా ప్రస్తుతం చైనాలో తయారైన కార్లను భారతదేశంలో విక్రయిస్తోంది. అందువల్ల దిగుమతి సుంకం భారీ స్థాయిలో ఉంది.దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ మాట్లాడుతూ.. ‘మీరు భారతదేశంలో Tesla ModelYని కొనుగోలు చేస్తే.. మీరు కంపెనీకి దాదాపు రూ. 33 లక్షలు చెల్లిస్తే.. ప్రభుత్వానికి రూ. 28 లక్షలు పన్నుగా చెల్లిస్తారు.
Tesla Model Y ధర రెట్టింపు ఎందుకంటే..
దిగుమతి సుంకం లేదా ఇతర పన్నుల కారణంగా Tesla Model Y ధర రెట్టింపు అయింది. రోడ్డు పన్ను, బీమా, GST మొదలైన వాటిని విడిగా వసూలు చేస్తారు. Tesla భారతదేశంలో ఉత్పత్తిని లేదా కనీసం అసెంబ్లీని ప్రారంభించకపోతే.. అది విజయవంతం కాదని మరొక నెటిజన్ తెలిపారు. కాగా టెస్లా ప్రస్తుతం భారతదేశంలో ప్రస్తుతం తన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం లేదు. చైనాలో తయారైన కార్లను ఇండియాకు తీసుకువచ్చి విక్రయిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ కారుపై చాలా పన్ను విధించబడుతుంది.
అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సిందే
కంపెనీ దాని వెబ్‌సైట్‌లో ఈ కార్ల మీద ఫైనాన్సింగ్, EMI లేదా లీజు పథకం గురించి ఎటువంటి సమాచారాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కస్టమర్ ఈ కారును సొంతం చేసుకోవాలనుbకుంటే పూర్తి మొత్తం నగదు చెల్లించాలని కంపెనీ వెబ్ సైట్ ని బట్టి తెలుస్తోంది.అయితే భారతదేశం వంటి మధ్యతరగతి మార్కెట్‌లో.. వినియోగదారులు వాయిదాలలో కొనడానికి ఇష్టపడతారు. టెస్లా కంపెనీ నగదు ఎంపికతో మాత్రమే ప్రారంభించడం పరిమిత వ్యూహంగా పరిగణించబడుతుంది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి