నిమిషకు మరణశిక్ష పడాల్సిందే...బాధిత కుటుంబం
- July 16, 2025
యెమెన్: యెమెన్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మహిళ నిమిష ప్రియకు తాత్కాలికంగా ఊరట లభించిన విషయం తెలిసిందే. కోర్టు ఆమె మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయం ఆమె కుటుంబానికి కాస్త ఊరటను కలిగించింది. అయితే ఇది తుదికి క్షమాదానం కాదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.
బ్లడ్ మనీకి నిరాకరణ–బాధిత కుటుంబం బాంబ్
నిమిష ప్రియకు క్షమాభిక్ష దొరకే అవకాశం బ్లడ్ మనీ (పరిహారధనం) చెల్లింపుతో ఉండొచ్చని భావించారు. కానీ మృతుడి సోదరుడు అబ్రెల్ స్పష్టంగా “బ్లడ్ మనీకి మేము అంగీకరించం, శిక్ష పడాల్సిందే” అని డిమాండ్ చేయడంతో పరిస్థితి తిరుగుబాటు లాంఛనంగా మారింది. ఇది నిమిష ప్రియకు తీవ్ర ప్రతికూలతగా మారింది.
బాధిత కుటుంబం ప్రకారం నిమిష ప్రియ ఇస్లామిక్ లా ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని అంటోంది. వారు క్షమించేందుకు సిద్ధంగా లేరని స్పష్టంగా ప్రకటించారు. దీంతో ఇప్పటికే తీవ్రమైన నిమిష పరిస్థితి మరింత సంక్షోభానికి గురైంది. మళ్లీ కోర్టు విచారణకు వెళ్తేనేగాని, ఆమె భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందన్నది తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







