టాక్సీ ఛార్జీల కంటే చౌక.. విజ్ ఎయిర్ నిర్ణయంతో నిరాశ..!!
- July 16, 2025
యూఏఈ: దుబాయ్ నుండి అబుదాబికి టాక్సీ ఛార్జీ Dh250 నుండి Dh300 వరకు ఉంటుంది. కానీ చాలా మంది యూఏఈ నివాసితులు టాక్సి ఛార్జీలకంటే తక్కువకే ఫ్లైట్స్ టిక్కెట్స్ ను విజ్ ఎయిర్ అందిస్తూ మన్ననలు పొందింది. ఇది రూట్, సీజన్ ఆధారంగా Dh129 నుండి ప్రారంభమయ్యే వన్-వే టిక్కెట్లను అందించింది. అయితే, విజ్ ఎయిర్ సెప్టెంబర్ 1 నుండి అబుదాబి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో విదేశాలకు ప్రయాణించడానికి అత్యంత తక్కువ విమానయాన సంస్థ సేవల్లో ఒకదాన్ని కోల్పోవడం పట్ల చాలా మంది నివాసితులు నిరాశ చెందినట్లు తెలిపారు.
విజ్ ఎయిర్ ప్రయాణాన్ని చాలా తక్కువకే అందించిందని, తరచుగా అబుదాబి విమానాశ్రయానికి టాక్సీ ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణం కొనసాగించినట్లు దుబాయ్ నివాసి అయిన నోయెల్ అబ్రహం గుర్తుచేసుకున్నారు. “నేను దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్క్‌లో నివసిస్తున్నాను. నేను అబుదాబి విమానాశ్రయానికి టాక్సీ తీసుకుంటే, నాకు Dh200-250 ఖర్చవుతుంది. కానీ నేను తరచుగా విజ్ ఎయిర్‌లో బాకు లేదా ఇతర యూరోపియన్ నగరాల వంటి ప్రదేశాలకు కేవలం Dh180-190 కి వెళ్లగలిగాను.” అని నోయెల్ అన్నారు.
కాగా, కార్యకలాపాలను ముగించాలనే ఎయిర్‌లైన్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. “శీతాకాలం రావడంతో, చాలా మందికి నిస్సందేహంగా ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఊహించనిది. వ్యక్తిగతంగా, నేను ఈ సంవత్సరం జార్జియాను, వచ్చే సంవత్సరం అల్బేనియా, సెర్బియాను విజ్ ఎయిర్‌లోనే సందర్శించాలని అనుకున్నాను. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి తక్కువ ధర విమానయాన సంస్థ మరొకటి లేదు.” అని నోయెల్ అన్నారు.
గల్ఫ్ వెలుపల తన మొదటి పర్యటనకు వెళ్లే అవకాశాన్ని విజ్ ఎయిర్ ఇచ్చిందని డెయిరాలో నివసిస్తున్న లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ ఫాహిమ్ అర్మార్ గుర్తుచేసుకున్నారు. తాను విమాన ఛార్జీలను చూసి షాక్ అయ్యామని, తన స్నేహితులతో కలిసి టిక్కెట్లను బుక్ చేసుకున్నామని తెలిపారు. జార్జియాకు రౌండ్-ట్రిప్ టికెట్ ధర కేవలం Dh380 మాత్రమేనని.. ఆ ధర వల్ల మేమందరం వెళ్ళడానికి వీలు కలిగిందన్నారు. కాగా, విజ్ ఎయిర్ నిర్ణయం నిరాశ కలిగించిందని, తమ పర్యాటన షెడ్యూల్ ను మార్చుకోవల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!